గుండెపోటు.. టీ కాంగ్రెస్ నేత కుమారుడు మృతి
ఉన్నట్లుండి హార్ట్‌స్ట్రోక్‌తో క్షణాల్లో ప్రాణాలు విడవడం భయాందోళనకు గురి చేస్తోంది. అప్పటివరకు యాక్టివ్‌గా ఉన్నవారు ఒక్కసారిగా హార్ట్‌ఎటాక్‌తో కుప్పకూలిపోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేత మానుకొండ రాధా కిషోర్ కొడుకు మానకొండ శ్రీధర్(31) గుండెపోటుతో మృతి చెందాడు. సోమవారం ఉదయం జిమ్‌కి వెళ్లి వచ్చిన కొద్దిసేపటికి గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆప్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కుమారుడు మరణంతో కాంగ్రెస్ నేత రాధా కిషోర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుటుంబాన్ని పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శిస్తున్నారు.
అయితే ఇటీవల తెలంగాణ ఉద్యమ నేత, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంకుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి బీఆర్ఎస్ శ్రేణులందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. తన పాటలతో ఎంతోమందిని తెలంగాణ ఉద్యమం వైపు నడిపించిన సాయిచంద్.. ఆ తర్వాత ప్రభుత్వం, బీఆర్ఎస్ నిర్వహించే ప్రతీ సభలోనూ తన పాటలతో ప్రజలను ఆకట్టుకునేవారు. కేసీఆర్ పాలన, బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును తమ పాటల ద్వారా ప్రజలు తెలియజేసేవారు. దీంతో సాయిచంద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.









