AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరో దారుణం.. కదులుతున్న కారులో అరాచకం..

బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆదివాసీ వ్యక్తిపై మూత్ర విసర్జన సంఘటన మరువక ముందే అలాంటి తరహా అమానుష సంఘటన జరిగింది. ఒక వ్యక్తిని చెప్పుతో అతి దారుణంగా కొట్టడంతోపాటు బలవంతంగా పాదాన్ని నాకించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కదులుతున్న వాహనంలో ఒక వ్యక్తిపై మరో వ్యక్తి తొలుత చేతితో దాడి చేశాడు. ఆ తర్వాత చెప్పుతో అతడి ముఖంపై పలుసార్లు కొట్టాడు.

తన కాలును నొక్కించుకున్నాడు. అంతటితో ఆగని అతడు బాధిత వ్యక్తితో తన పాదాన్ని నాకించాడు. కాగా, శుక్రవారం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో దబ్రా టౌన్‌కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. బాధిత వ్యక్తి మోహ్సిన్‌ను గోలు గుర్జార్‌, అతడి స్నేహితుడు కలిసి కొట్టినట్లు పోలీసులు తెలిపారు. గోలు గుర్జార్‌ తన పాదాన్ని మోహ్సిన్‌తో నాకించాడని, వైరల్‌ అయిన ఈ వీడియో క్లిప్‌ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.

ANN TOP 10