AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్‌ ఢీల్లికి వెళ్లి డీల్‌ కుదిర్చాకే కిషన్‌రెడ్డిని నియమించారు..

బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే.. వారిని తరిమికొట్టాల్సిందే.. భట్టి
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి డీల్ మాట్లాడుకున్నాకే కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారన్నారు. రాహుల్ తమ నేత అని.. ఆయన్ని ఏ హోదాలోవస్తారని ప్రశ్నించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం, అవకాశం వచ్చిన ప్రతిసారీ కేసీఆర్ బీజేపీకి మద్దతిచ్చారన్నారు. మోదీ, కేసీఆర్ కలిసి దేశ, రాష్ట్ర వనరులని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. కోట్లాది తెచ్చుకున్న తెలంగాణకి న్యాయం చేయలేకపోయామన్నారు. ప్రజల సంక్షేమం కోసం అడ్డంగా నిలబడ్డ వాళ్ళని అడ్డుతొలగించాలన్నారు. క్యాప్తలిస్ట్ బీజేపీని, ఫ్యూడల్ బీఆర్ఎస్‌ను తెలంగాణ నుంచి తరిమివేయాలని అన్నారు. కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం అని తెలంగాణా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ప్రజలకి చెందాల్సింది పాలకులకు చెందుతుందని ప్రజలు గ్రహించారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ANN TOP 10