AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘ఈ జన్మకు ఇది చాలు’..బండి సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!

తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన విజయసంకల్ప సభలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, గవర్నర్‌ తమిళిసై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌, గడ్కరీ తదితర నేతలు పాల్గొన్నారు. ఇక బండి సంజయ్ ప్రసంగించేందుకు లేని నిలబడగానే ఈలలు, కేరింతలతో సభ మార్మోగింది. ప్రసంగం ముగిశాక మోదీ సైతం చప్పట్లు కొట్టడం ఆసక్తికరంగా మారింది.

జై శ్రీరామ్ అంటూ బండి సంజయ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ జన్మకు తనకు ఇది చాలని బండి సంజయ్ ప్రధాని మోదీ సమక్షంలో ఎమోషనల్ అయ్యారు. నరేంద్రమోదీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. మోదీని ఏ ముఖం పెట్టుకుని వచ్చాడని విమర్శించారని.. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసే ముఖం పెట్టుకుని వచ్చాడన్నారు. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని రాలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రపంచమే మన ప్రధాని మోదీని బాస్ గా గుర్తించి సెల్యూట్ చేస్తుందన్న బండి సంజయ్..కొందరు ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారంటే ఎందుకని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. జై మోదీ నినాదాలు చేసినప్పుడు సభికులు, నేతలు నిలబడ్డారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో రామరాజ్యం స్థాపిస్తామన్నారు. బండి సంజయ్ ప్రసంగం ముగించిన తర్వాత మోదీ చప్పట్లు కొట్టడం విశేషం.

ANN TOP 10