AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్!

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుడిహతర్నూర్ మండలం మేకలగండి వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అలాగే మరో ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే చనిపోయిన మృతదేహాలని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల వివరాల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10