AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూ.6109 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం

వరంగల్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. బీజేపీ విజయసంకల్ప సభలో మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సంజయ్‌, గడ్కరీ తదితర నేతలు పాల్గొన్నారు. సభాప్రాంగణం నుంచే అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు చేశారు. రూ.6109 కోట్లతో పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. ఆ అభివృద్ధి పనుల్లో భాగంగా రెండు నేషనల్ హైవేలకు ప్రధాని శ్రీకారం చుట్టారు. ప్రధాని శంకుస్థాపనల లిస్ట్‌లో.. రూ.521 కోట్లతో రైలు వ్యాగన్ల ఫ్యాక్టరీ, రూ.2,147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్‌-వరంగల్‌ నేషనల్ హైవే పనులు, రూ.3,441 కోట్లతో మంచిర్యాల-వరంగల్‌ నేషనల్ హైవే పనులు ఉన్నాయి.

వరంగల్‌కు చేరుకున్న వెంటనే ఆయన నేరుగా భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానికి భద్రకాళి అమ్మవారి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ప్రధానికి స్వాగతం పలికారు. భద్రకాళి అమ్మవారి ఆలయం నుంచి మోదీ నేరుగా హన్మకొండ అర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ గ్రౌండ్‌కు చేరుకోకున్నారు. అక్కడ బీజేపీ విజయ సంకల్ప సభకు భారీ ఏర్పాట్లు చేసింది. ఇక్కడి నుంచే ప్రధాని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ANN TOP 10