
ప్రధాని మోదీ ఇవాళ ఉదయం 10.30 గంటలకు వరంగల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తూ కొంతమంది ఆగంతకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.









