AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఐడీ విచారణకు రామోజీ రావు, శైలజా కిరణ్ గైర్హాజరు

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో నిందితులుగా వున్నా ఆ సంస్థ చైర్మన్ రామోజీ రావు, ఆ సంస్థ MD శైలజా కిరణ్ ఈరోజు సీఐడీ విచారణకు హాజరు కాలేదు. ఈ సమాచారాన్ని ముందుగానే ఈ మెయిల్ లో గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి తెలియచేసారు. రామోజీరావు తన ఆరోగ్యం బాగోలేదు అని అందుకు తాను విచారణకు హాజరు కాలేకపోతున్నాను అని అయన ఈ మెయిల్ లో పేర్కొన్నారు. ఆర్బీఐ నిబంధనలు, చిట్ ఫండ్స్ విషయంలో ఉన్న కేంద్ర చట్టాలను ఉల్లంఘించి మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రాంతీయ ఆఫీసుకు రావాలని సీఆర్‌పీసీ 41(ఏ) ప్రకారం సీఐడీ నోటీసులు జారీ చేసింది.

ANN TOP 10