AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌లో బీసీల పరిస్థితిపై పొన్నాల హాట్ కామెంట్స్

పొన్నాల నివాసంలో బీసీ నేతల సమావేశం
తెలంగాణా కాంగ్రెస్‌ లో మరొక సరికొత్త దుమారం బయటికి వచ్చింది. తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ బీసీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. పొన్నాల నివాసంలో ఈ బీసీ నేతలు అంతా సమావేశం అయీనట్లు తెలుస్తుంది. ప్రతి పార్లమెంట్‌ పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలి అని డిమాండ్‌ చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్‌ లో పొందు పరచవలిసిన ఇతర అంశాలు పైనా కూడా చర్చించినట్లు సమాచారం. పార్టీలో బీసీ లకు గుర్తింపు ఇవ్వాలి అని కోరుతున్నారు పొన్నాల లక్ష్మయ్య. బీసీ లను విస్మరిస్తే ఏ పార్టీకి అయీనా మనుగడ కష్టం అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్‌ కూడా ఈ విషయన్ని పరిగణలోకి తెసుకోవాలి అని అయన సూచిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవలిసిన సందర్భం వచ్చిందని అన్నారు పొన్నాల లక్ష్మయ్య.

ANN TOP 10