తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. రాజీనామా అనంతరం ఆయన రిలీజ్ చేసిన ప్రకటన చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. అయితే బండి సేవలను ఢిల్లీలో ఉపయోగించుకుంటామని పెద్దలు చెబుతున్న తరుణంలో బీజేపీకి బండి సంజయ్ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కేంద్ర కేబినెట్ లో చేరేందుకు బండి సంజయ్ విముఖత చూపిస్తున్నట్టు తెలుస్తుంది. తాను సామాన్య కార్యకర్తలాగే ఉంటానని బండి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు బీజేపీ అధ్యక్షునిగా నియామకం అయిన కిషన్ రెడ్డి ప్రస్తుతం సైలెంట్ మోడ్ లోకి వెళ్లడం బీజేపీలో గందరగోళానికి దారి తీస్తుంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి అధికారికంగా వీడ్కోలు పలుకుతున్నానని..మన జీవితంలో కొన్ని అధ్యాయాలు ముగింపు దశకు రాకుండానే ముగిసిపోతాయని బండి సంజయ్ (Bandi Sanjay) ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇక తన పదవీకాలంలో ఎవరినైనా బాధించే ఉంటే క్షమించాలని..వారి ఆశీస్సులు అందించాలని బండి సంజయ్ ఈ ప్రకటన ద్వారా కోరారు.తాను అధ్యక్ష పదవిలో ఉన్నంత వరకు విచారించదగ్గ సంఘటనలు ఏమి జరగకపోవడం సంతోషదాయకమని..మరిచిపోలేని అనుభూతులను అందించారని సంజయ్ పేర్కొన్నారు. అరెస్టుల సమయంలో దాడుల సమయంలో ఇతర అన్ని సందర్భాల్లో వెన్నంటి నిలిచారని అన్నారు.
కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా తన పోరాటంలో కార్యకర్తల పాత్ర ఎనలేనిదన్న బండి సంజయ్ (Bandi Sanjay)..అరెస్టులకు..దాడులకు భయపడకుండా నిలిచినా వారికి హ్యాట్సాఫ్ చెప్పారు. తాను ఇప్పటికీ కార్యకర్తల్లో ఒకడినే..ఇకపైనా కార్యకర్తగానే ఉంటా. కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ అభ్యున్నతి కోసం నవ్యోత్సాహంతో కృషి చేస్తానని ఆ ప్రకటనలో బండి సంజయ్ (Bandi Sanjay) పేర్కొన్నారు. తనలాంటి సాధారణ కార్యకర్తకు పెద్ద అవకాశం ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాకు, అలాగే బిఎల్ సంతోష్, శివప్రకాష్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్, తరుణ్ ఛుగ్ లకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.









