AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి బీజేపీ హై కమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఇటీవలే భారతీయ జనతా పార్టీ లో చేరిన అయనకు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం లోకి చోటు కల్పించింది. పార్టీ లో అనుభవం వున్న నాయకులకు పెద్ద పదవులు కట్టబెట్టింది.

మరో 9 నెలలో ఎన్నికలు వస్తున్న సందర్బం లో బీజేపీ అధిష్టానం కీలక నియామకాలు చేపట్టింది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నియామకం తక్షణం అమలులోకి వస్తుందని పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు, అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గా ఉన్న సోము వీర్రాజు ని తొలగించి దగ్గుపాటి పురందేశ్వరిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది. పురందేశ్వరి నాయకత్వం లో ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ ఎన్నికలకు వెళ్లనుంది.

ANN TOP 10