AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నగర శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లిలో పెద్ద మొత్తంలో మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. 400 ఇంజక్షన్లను సీజ్ చేశారు. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా.. అధికారులు దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్న నితీష్, రాహుల్‌తో పాటు సోహెల్ అనే మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్డుబడ్డ ఇంజక్షన్స్ ఎక్కడి నుండి తెస్తున్నారు. ప్రధాన సూత్రధారి ఎవరు అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఇంజక్షన్లను ఎక్కువగా జిమ్‌లో బాడీబిల్డర్‌ల కోసం వాడి దుర్వినియోగం చేస్తున్నారని అధికారుల విచారణలో ప్రాథమికంగా తేలింది.

నిర్మాత కేపీ చౌదరి కాల్‌ లిస్ట్‌పై ఆరా..
సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్టుతో సినీ పరిశ్రమలోని కొందరికి నిద్ర పట్టడం లేదు. గోవా నుంచి తీసుకొచ్చిన 100 గ్రాముల కొకైన్‌ను కిస్మత్‌పూర్‌ పరిసరాల్లో అమ్మేందుకు యత్నిస్తూ కేపీ చౌదరి ఈనెల 14న పోలీసులకు దొరికిపోయాడు. అయితే తెలుగు సినీ పరిశ్రమలోని కొందరికి అతడు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గోవా, హైదరాబాద్‌లో ప్రైవేట్ పార్టీలు నిర్వహించిన కేపీ చౌదరి.. పలువురికి డ్రగ్స్ అందించాడు. అయితే అతడికి సంబంధించిన నాలుగు ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం ఆ నాలుగు ఫోన్‌ల నుంచి కాల్ డేటా బయటకు తీస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా చాటింగ్ చేసి డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ చాటింగ్‌ల్లో ఇద్దరు హీరోయిన్లు, నలుగురు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, ఓ డైరెక్టర్‌ ఉన్నట్లు తెలిసింది.

ANN TOP 10