తారకరత్న ఆరోగ్యంపై నందమూరి కల్యాణ్ రామ్ స్పందించేందుకు నిరాకరించారు. ఆరోగ్యం విషయంపై ఆస్పత్రి వారు చెబితేనే బాగుంటుందని అని చెప్పారు. తనని తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అడగటం సరి కాదు అని కూడా చెప్పారు. నందమూరి కల్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమా ప్రచారానికి మీడియా వాళ్ళని కలిసారు. అందులో భాగంగానే అతని కజిన్ తారకరత్న ఆరోగ్యం ఎలా వుంది అని అడిగిన ఒక ప్రశ్నకి కల్యాణ్ రామ్ చెప్పేందుకు నిరాకరించారు. తను చెపితే బాగోదని చెప్పాడు. ఆ విషయాలు అన్నీ తను చెప్పేది కన్నా ఆస్పత్రి వాళ్ళు చెపితేనే బాగుంటుంది అని చెప్పారు.
‘అమిగోస్’ సినిమాలో కల్యాణ్ రామ్ మూడు పాత్రలు పోషిస్తున్నారు. అందులో విలన్ కూడా తానే పోషిస్తున్నాను మొదట్లో కొంచెం భయం వేసింది అని అన్నారు. ఎందుకంటే ఇంతవరకు హీరో గా ఇన్ని సినిమాలు చేసి మళ్లీ విలన్ ఏంటి, ఆ భాష, లుక్స్, అప్పీరెన్స్ అన్నీ కొంచెం నెగటివ్ గా వుంది చేయటం ఏంటి అని, కానీ అది బాగా ఎంజాయ్ చేసి చేశాను అని చెప్పారు.