రేపు అంత్యక్రియలు..
హైదరాబాద్: సినీ నటుడు నందమూరి తారకరత్న గత నెల 27న తీవ్ర గుండెపోటుకు గురై, 23 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. తారకరత్న భౌతిక కాయం బెంగుళూరు నుంచి నేడు రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో ఆయన నివాసానికి చేరుకుంది. అక్కడి నుంచి సోమవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం చాంబర్‌కు తరలిస్తారు. అభిమానుల సందర్శనార్థం అక్కడ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంచుతారు. ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.