సోషల్ మీడియాలో రేణూదేశాయ్ షాకింగ్ పోస్ట్
సోషల్ మీడియాలో నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ షాకింగ్ న్యూస్ పోస్ట్ చేశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నానని తెలిపారు. వ్యాధి నివారణకు చికిత్స తీసుకుంటున్నా.. మందులు వాడుతున్నా.. యోగా చేస్తున్నా.. పోషకాహారం తింటున్నా.. త్వరలోనే నేను సాధారణ జీవితానికి తిరిగి వచ్చి, మళ్లీ షూటింగ్‌కి వెళ్తానని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
‘నా సన్నిహితులకి, ప్రియమైన వారందరికీ నేను కొంతకాలంగా గుండె, అలాగే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తెలుసు. అయితే కొన్నిసార్లు వాటన్నింటిని తట్టుకొని నిలబడడం, వాటిని ఎదుర్కొన్నే శక్తిని కూడగట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నాలాగా పలు రకాల సమస్యలతో పోరాడుతున్న చాలా మందిలో ధైర్యం నింపడానికే ఈ పోస్ట్‌ని షేర్ చేస్తున్నాను. ఏది ఏమైనా సరే మనపై మనకి నమ్మకం ఉండాలి. అలాగే సమస్యలకు గట్టిగా ఎదురు నిలబడాలి’ అని రేణూదేశాయ్ పేర్కొన్నారు.
ఈ మధ్య కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్ నటీమణులు అలాంటి వ్యాధులతో పోరాడి గెలిచారు. ఇటీవలే నటి సమంత సైతం మయోసైటిస్ బారిన పడగా ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. తాజాగా మరో నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సైతం ఓ వ్యాధితో బాధ పడుతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు.