AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమ్మ న్యూస్‌ స్టూడియోలో గవర్నర్‌ తనయ



వ్యక్తిత్వం.. మానవత్వం.. స్థిరత్వాన్ని తండ్రి నుంచి అందిపుచ్చుకున్న మహిళ.. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. సామాజిక సేవ చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్న ధీరవనిత.. ఆమె ఎవరో కాదండి.. మన దత్తన్న కూతురు.. అదేనండి హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తనయురాలు.. బండారు విజయలక్ష్మి. అమ్మ న్యూస్‌ టీవీ స్టూడియోకు విచ్చేసి ఎన్నో విషయాలు విశేషాలను పంచుకున్నారు. అలయ్‌.. బలయ్‌ వారి ఇంటిపేరుగా మారినట్లే.. తండ్రి, తనయులు తెలుగు ప్రజల్లో తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ అమ్మన్యూస్‌ ఛానల్‌ ను యువ పారిశ్రామికవేత్త, ఎన్‌ ఆర్‌ ఐ కంది శ్రీనివాసరెడ్డి ఎంతో గొప్ప ఆశయంతో ప్రారంభించారని, తెలంగాణ లో ఇది గొప్ప ఛానల్‌ గా ఎదుగుతున్నదని బండారు విజయలక్ష్మి ప్రశంసించారు. టీవీ స్టూడియోకు విచ్చేసిన విజయలక్ష్మికి అమ్మన్యూస్‌ సీఈఓ రామచంద్రారెడ్డి, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అరవింద్‌, ఔట్‌పుట్‌ ఎడిటర్‌ సత్యనారాయణ, బ్యూరోచీఫ్‌ కృష్ణమూర్తి ఆత్మీయ సాదర స్వాగతం పలికారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10