AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీపీఆర్ ఎలా చేయాలో శిక్షణ ఇస్తాం

మంత్రి హరీష్ రావు
రాజేంద్రనగర్ సర్కిల్ అరాంఘర్ చౌరస్తా వద్ద బస్‌స్టాప్‌లో ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజశేఖర్.. వెంటనే స్పందించి సీపీఆర్ చేసి అతడిని కాపాడారు. రాజశేఖర్ సీపీఆర్ చేయకపోతే ఆ యువకుడి ప్రాణాలకు ముప్పు వాటిల్లి ఉండేది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్ రాజశేఖర్‌ను వైద్య మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రంట్‌లైన్ వర్కర్స్ అందరికీ సీపీఆర్ శిక్షణ ఇప్తిస్తామని చెప్పారు.

బస్‌స్టాప్‌లో బస్సు దిగిన యువకుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. అక్కడే కూడలిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అతడిని గమనించి వెంటనే పరుగెత్తుకొచ్చారు. అతడికి సీపీఆర్‌ చేసి రక్షించారు. హైదరాబాద్‌లోని ఆరాంఘర్‌ చౌరస్తాలో శుక్రవారం (ఫిబ్రవరి 24) ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సీపీఆర్ చేసిన అనంతరం బాధితుడు బాలాజీ కాస్త స్పృహలోకి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం బాధితుడు పూర్తిగా కోలుకున్నాడని ట్రాఫిక్‌ సీఐ శ్యామ్‌సుందర్‌ రెడ్డి తెలిపారు. సకాలంలో స్పందించి సీపీఆర్ చేసి యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రాజశేఖర్‌ను స్థానికులు ప్రశంసించారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయణ్ని అభినందించారు.

ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. ‘రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్‌ను ఎంతో అభినందిస్తున్నాం. సమయస్ఫూర్తితో స్పందించి సీపీఆర్  చేయడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడటంలో ఆయన ప్రశంసనీయమైన పని చేశారు’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు.

ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని పేర్కొన్న హరీష్ రావు.. సీపీఆర్‌పై కీలక ప్రకటన చేశారు. అందరు ఫ్రంట్‌లైన్ వర్కర్స్, వైద్య సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం తరఫున త్వరలో సీపీఆర్ఎలా చేయాలో శిక్షణ ఇస్తామని ప్రకటించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10