AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రజాశాంతి పార్టీలో చేరికలు చూసి కేసీఆర్ భయపడుతున్నారు

తెలంగాణ సీఎం బీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పొలిటికల్ కమెడియన్.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్.. నరకానికి  వెళ్తాడు.. అంటూ.. ఆయన మండిపడ్డారు. నిజానికి కేఏ పాల్ ఇటీవల కాలంలో ఒకటి రెండు అంశాల్లో కేసీఆర్ ను మెచ్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె కవిత చుట్టూ మద్యం స్కాం కేసు చుట్టుముట్టిన తరుణంలో అన్ని పార్టీల నాయకులు ఏం జరుగుతుందా ? అని ఎదురు చూశారు.

ఇలాంటి సమయంలో బీజేపీయేతర ఏ పార్టీ కూడా స్పందించలేదు. కానీ పాల్ మాత్రం సంచలన వ్యాఖ్య లు చేశారు. కవితపై కేంద్రం కక్ష కట్టిందని.. తెలంగాణకు డబ్బులు ఇవ్వకుండా.. అధికార పార్టీ నేతలను టార్గెట్ చేసిందని వ్యాఖ్యానించారు. దీంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అదేంటి.. నిత్యం విమర్శలు గుప్పించే పాల్.. ఇలా పాలు నీళ్లలా కలిసిపోయారు.. అని అనుకున్నారు. కానీ.. ఇంతలోనే పాల్ తన మాటలకు పదును పెంచారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ దొర కాదు దొంగ అని కోర్టులో రుజువు చేస్తానని అన్నారు. ఆయన తనను ఎదుర్కోలేక.. తన సోదరుడి హత్య కేసును తిరగతోడుతున్నారని కేసీఆర్పై పాల్ నిప్పులు చెరిగారు.  హైకోర్టు సుప్రీం కోర్టును కేసీఆర్ కొనలేరన్నారు. ప్రపంచంలోని మహామహా నేతలనే తన ముందు మోకరిల్లేలా చేశానని కేసీఆర్ ఎంత అంటూ హెచ్చరించారు.

కేసీఆర్ తనను చంపేస్తే స్వర్గానికి వెళ్తానని కానీ.. చేసిన అవినీతి పాపాలకు కేసీఆర్ ఖచ్చితంగా నరకానికి వెళ్తారని.. ఇది తాను ఇస్తున్న శాపమని.. పాల్ వ్యాఖ్యానించారు. తాను ప్రార్థన చేస్తే కేసీఆర్ నాశనం అవుతారని.. ఇప్పటి వరకు అలా చేయలేదని చెప్పారు. దేవుడి దూత మీద చెయ్యి వేస్తే దేవుడు క్షమించడని చివరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తమ్ముడు కూడా మిగలలేదని పాత సంగతులు చెప్పుకొచ్చారు. మరి పాల్తో పెట్టుకుంటే అంతే అంటున్నారు నెటిజన్లు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10