AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సింగరేణిపై కేసీఆర్‌ సర్కార్‌ కర్కషం

శమ్రదోపిడీకి పాల్పడుతున్న ప్రభుత్వం
అధికారంలోకి రాగానే అవకతవకలపై విచారణ జరిపిస్తా
పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

సింగరేణిలో రెగ్యులర్‌ కార్మికులను తొలగించి కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించి ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రమదోపిడీకి పాల్పడుతోందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గని కార్మికుల పట్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కర్కషంగా వ్యవహరిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా సింగరేణలోని మైనింగ్‌ వద్దకు చేరుకున్న రేవంత్‌.. కార్మికులతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో గని కార్మికుల పాత్ర ఎంతో ఉందన్నారు. ఒకప్పుడు 70 వేలుగా ఉన్న ఉద్యోగులు నేడు 40 వేలకు తగ్గిపోయారన్నారు.

కమీషన్ల కక్కుర్తి కోసం ఓపెన్‌ కాస్ట్‌ గనులను ప్రైవేటుకు కట్టబెడుతున్నారని అన్నారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయొద్దని పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీశామన్నారు. సింగరేణి ఆధీనంలో ఉన్న గనులను ప్రైవేటుకు అప్పగించి దోపీడికి పాల్పడుతున్నారు. గనులను ప్రైవేటుకు కట్టబెట్టి రూ.25 వేల కోట్లు దోపీడికి పాల్పడాలని చూస్తున్నారని మండిపడ్డారు. సింగరేణికి జెన్‌ కో రూ.12 వేల కోట్ల బకాయి పడిరదని, అందుకే సింగరేణిలో కార్మికుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. వీటన్నింటికి సింగరేణి సీఎండీ శ్రీధర్‌ కారణమన్నారు. క్రిమినల్‌ కేసులు ఉన్న అధికారి సీఎండీగా ఉండటానికి వీల్లేదన్నారు. రెండు మూడేళ్లు మాత్రమే ఆ స్థానంలో ఉండాల్సిన అధికారి ఏళ్లు గడుస్తున్నా సీఎండీగా కొనసాగుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణిలో అవకతవకలపై విచారణకు ఆదేశిస్తూ తొలి సంతకం చేస్తామన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10