తిరుపతి: ఓ మహిళ ఎస్ఐ కుటుంబ సభ్యులు వ్యభిచార గృహ నిర్వాహకులుగా గుర్తించి వారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యాలరెడ్డిపల్లిలో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. వ్యభిచార గృహ నిర్వాహకులు ఓ మహిళ ఎస్ఐ తల్లి, తమ్ముడిగా గుర్తించారు. సదరు మహిళా ఎస్ఐకి గత సంవత్సరం పెళ్లి జరగడంతో తన భర్త కలిసి ఉంటుంది. మహిళా ఎస్ఐ తమ్ముడు, తల్లి ఎంఆర్ పల్లి ప్రాంతంలోని ధనలక్ష్మినగర్‌లో ఉంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ సురేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఇద్దరుతో పాటు మరో విటుడిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు అమ్మాయిలని హోమ్‌కు తరలించామన్నారు.