న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. తర్వాత దానిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అనేక ప్రతిపక్షాలను ఏకం చేసి ఆయన బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశారు. కాగా ప్రధాని మోదీ ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘ కాలం ఆయురారోగ్యాల కోసం నేను ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యనాయకులు, ఆయాపార్టీల నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.