AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మళ్లీ రెచ్చిపోయిన బండ్లన్న

వంచించేవాడే గురువులా నటిస్తాడు అంటూ తాజా ట్వీట్‌

‘మోసం చేయాలనుకునేవాడు మేధావిలా నటిస్తాడు.. వంచించేవాడు గురువులా నటిస్తాడు’ అని నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ తాజాగా చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. అందులో ఆయన ఎవరిని ఉద్దేశించి ట్వీట్‌ చేశారనే అంశంపై హాట్‌టాపిక్‌గా మారింది.

పవన్‌ కల్యాణ్‌ని విపరీతంగా ఆరాధిస్తూ.. ఆయన్ని ప్రేమగా దేవర అని పిలుచుకునే వ్యక్తి బండ్ల గణేశ్‌. ఇప్పుడాయన సోషల్‌ మీడియాలోచాలా యాక్టివ్‌గా ఉంటూ కొందరిపై ప్రేమను, మరికొందరిపై ఇన్‌ డైరెక్ట్‌గా కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌ చూస్తుంతే.. పవన్‌ కల్యాణ్‌కి ఎంతో ఇష్టమైన వ్యక్తి, స్నేహితుడైన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌పై బండ్ల పంచ్‌ వేసినట్లుగా ఉంది.

కొన్నాళ్ల ముందు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కారణంగానే బండ్ల గణేశ్‌ను పవన్‌ కల్యాణ్‌ దూరం పెట్టాడని, భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి రానీయలేదనే వార్తలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. త్రివిక్రమ్‌ను బండ్ల తిట్టే ఆడియో కూడా బయటకు వచ్చింది. అది నా ఆడియో కాదని చెప్పిన బండ్ల గణేశ్‌.. వీలు చిక్కినప్పుడల్లా త్రివిక్రమ్‌పై ఇన్‌ డైరెక్ట్‌ పంచ్‌లే పేల్చేస్తున్నారు. తాజాగా ‘మోసం చేయాలనుకునే వాడు మేధావిలా నటిస్తాడు.. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు.. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు భక్తుడు గానే పొగరుగా ఉంటాడు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా..’ అంటూ బండ్ల చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10