యువగళం ( yuva galam) పాదయాత్రలో భాగంగా కుప్పం నియోజకవర్గం కడపల్లిలో తెలుగుదేశం (TDP) నేత నారా లోకేశ్ (Nara lokesh) శనివారం బీసీలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో బీసీ (BCs)లు ఎదుర్కొంటున్న సమస్యలను బీసీ నేతలు లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. Lokesh Padayatra: జగన్ మోసం చేశారు ఎన్నికలు ముందు బీసీలకు ఎన్నో హామీలిచ్చిన జగన్ (CM Jagan) .. అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తెలుగుదేశం (TDP) నేత లోకేశ్ విమర్శించారు. అధికారంలోకి రాగానే వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేరుస్తా అని జగన్ హామీ ఇచ్చాడని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.
రిజర్వేషన్లు తగ్గించి సుమారు 16,500 మంది బీసీలను పదవులకి జగన్ రెడ్డి దూరం చేసాడని విమర్శించారు. బీసిల్లో 140 కి పైగా కులాలు ఉంటే కేవలం 4 కులాలకి మాత్రమే అరకొర ఆర్ధిక సహాయం అందిస్తున్నారని Nara lokesh విమర్శించారు. Lokesh Padayatra: బీసీలను చంపేస్తున్నారు.. వైసీపీ పాలనలో 26 మంది బీసీలను దారుణంగా చంపేశారని తెలుగుదేశం (TDP) నేత లోకేశ్ (Nara lokesh) వ్యాఖ్యానించారు. ‘ఉప కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. ఒక్క లోన్ ఇచ్చారా? ఒక్కరికైనా సబ్సిడీ ఇచ్చారా?’ అని ప్రశ్నించారు. కుల వృత్తులను సీఎం జగన్ (CM Jagan) దెబ్బ తీశారని విమర్శించారు. వడ్డెర్ల చేతిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న గనులను వైసిపి నాయకులు బలవంతంగా లాక్కున్నారన్నారు. ‘ఆదరణ పథకం ఎత్తేసారు. టీడీపీ హయాంలో కొన్న పనిముట్లను కూడా ఈ సైకో జగన్ ఇవ్వడం లేదు’ అని ఆరోపించారు. ‘మీ పార్టీ రంగులు వేసైనా ఆ పనిముట్లను ఇవ్వాల’ని లోకేశ్ (Nara lokesh) కోరారు.