AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు

కేసీఆర్‌ ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు
బీజేపీని, బీఆర్‌ఎస్‌ను చిత్తుచిత్తుగా ఓడిరచాల్సిందే
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌

న్యూఢిల్లీ: దేశాన్ని అమ్మేసింది బీజేపీ ప్రభుత్వమైతే, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ నియంత పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని అన్నారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తనని ఎందుకు కలిశారో అంబేడ్కర్‌ జయంతి (ఏప్రిల్‌ 14) రోజున తెలుస్తుందన్నారు. తాము ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోమన్నారు. తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేల్లో 15 నుంచి 20 గెలుపు గుర్రాలు ఉన్నాయి. ప్రజాసేవ చేసేందుకు వారు ఏ పార్టీలోనైనా చేరవచ్చని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని, నేను ఢిల్లీ రాక ముందు ఎవరెవరితో మాట్లాడానో కేసీఆర్‌కు తెలుసునని అన్నారు. కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. కాంగ్రెస్‌ 56ఏళ్లలో చేయని అప్పు ఎనిమిదేళ్లలో మోదీ చేశారని కేఏ పాల్‌ వ్యాఖ్యానించారు. మోదీ, అదానీ కలిసి దేశం పరువు తీస్తున్నారని కేఏ పాల్‌ మండిపడ్డారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10