AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిజామాబాద్‌లో మెడికో ఆత్మహత్య

నిజామాబాద్‌ : కాకతీయ మెడికల్‌ విద్యార్థిని ప్రీతి అటు ప్రాణాలతో పోరాడుతుండగానే… నిజామాబాద్‌లో హర్ష అనే మరో మెడికల్‌ స్టూడెంట్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైద్య విద్యార్థి స్వస్థలం మంచిర్యాల జిల్లా జిన్నారం. కాగా.. అర్ధరాత్రి రెండు గంటల వరకూ తోటివారితో కలిసి చదువుకున్న హర్ష.. తెల్లవారేసరికి హాస్టల్‌ గదిలో శవమై కనిపించాడు. ఏమైందో ఏమో కానీ ఉరేసుకుని బలవన్మరణం పాలయ్యాడు. హర్ష నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే హర్ష ఆత్మహత్యకు కారణం తెలియరాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి ఇంకా ప్రాణాల కోసం పోరాడుతూనే ఉంది. ఆమె హెల్త్‌ బులిటెన్‌ను నిమ్స్‌ హాస్పిటల్‌  వైద్యులు కాసేపటి క్రితం విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా నే ఉందని వైద్యులు తెలిపారు. నాలుగు రోజులుగా ప్రీతికి చికిత్స జరుగుతోంది. ఇంకా ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌పై ఉంచి ప్రీతికి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రీతిని కాపాడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ మేరకు డీఎంహెచ్‌వోకు వైద్యుల బృందం నివేదికను అందజేసింది. ప్రీతి ఆత్మహత్యాయత్నంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కేసు నమోదు చేసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10