తెలంగాణలో చాలా ఏళ్ల పాటు భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు జరిగాయి. నిజానికి తెలంగాణలో ఒకప్పుడు ఎక్కువగా జమీందార్ల వ్యవస్థ ఉండటంతో వాళ్లే ఎక్కువగా భూస్వాములుగా ఉండేవారు. వాళ్ల దగ్గరే ఎక్కువగా భూములు ఉండేవి. వాళ్లనే అగ్రవర్ణాలు అని పిలుస్తారు. వాళ్ల వద్ద పని చేసే వాళ్లు తక్కువ కులం వాళ్లు ఉండేవారు. కౌలుదారులుగా, ఇతర పనులకు బీసీ, ఇతర కులాల వారు ఉండేవారు. అయితే.. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు కాదు. ఇప్పుడు బీసీల్లోనూ మార్పు వచ్చింది. వాళ్లు కూడా ఎదుగుతున్నారు అనడానికి తాజా తెలంగాణ లాండ్ సర్వేనే ఉదాహరణ. తెలంగాణలో బీసీల జాబితాలో చాలా కులాలు ఉన్నాయి.
అందులో కొన్ని కులాలు.. ఎక్కువ శాతం వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉంది. దీంతో రైతు స్వరాజ్య వేదిక నిర్వహించిన సర్వే ప్రకారం చూస్తే.. 44 శాతం భూమి బీసీ కులాల ఆధీనంలో ఉందట. తెలంగాణలో ఉన్న భూముల్లో 44 శాతం భూములు బీసీలకే ఉన్నాయట. అందులో 43 శాతం అగ్రవర్ణాల ఆధీనంలో ఉందట. అయితే.. 44 శాతం బీసీల భూముల్లో కేవలం 26 శాతం మంది మాత్రమే సొంతంగా వ్యవసాయం చేస్తున్నారట. మిగితా వాళ్లు వివిధ వృత్తుల్లో ఉన్నారు. మరోవైపు కౌలు వ్యవసాయం చేసే వాళ్లు కూడా ఎక్కువగా బీసీలే ఉన్నారట. తెలంగాణలోని 20 జిల్లాల్లో నిర్వహించిన రైతు స్వరాజ్య వేదిక.. కొన్ని కుటుంబాలను అడిగి వారి నుంచి సమాధానాలు తెలుసుకుంది.
భూమి కౌలు విషయం, ఎక్కువగా భూములు కొనుగోలు చేస్తున్న విషయం, అన్నింటి గురించి వెలుగులోకి వచ్చింది. అందులో ఎక్కువగా బీసీలే ఉండటం గమనార్హం. అయితే.. ఎక్కువ భూములు మున్నూరు కాపు కులస్తులు ఆధీనంలో ఉన్నాయట. ఆ తర్వాత యాదవ్స్, గౌడ్స్ చేతుల్లో ఉన్నాయట. నిజానికి తెలంగాణలో ఒకప్పుడు భూములకు అంతగా విలువ లేదు కానీ.. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో.. ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలను రైతులకు అందిస్తుందో అప్పటి నుంచి తెలంగాణలో భూముల విలువ పెరిగింది. నీళ్లు కూడా పుష్కలంగా ఉండటంతో చాలామంది భూములు కొనడానికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు.