ఇప్పుడు తారకరత్న గురించి న్యూస్ బాగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు ప్రారంభం రోజున హాజరయ్యారు. మసీదులో ప్రార్థనలు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న సమయంలో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. కేసీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన గుండె ఎడమ కవాటం బాగా దెబ్బతినిందని డాక్టర్లు చెప్పారు. ఇక మెరుగైన చికిత్స కోసం బెంగుళూరులోని హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు పదిమంది ప్రత్యేకమైన డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ఆయన ఎంపీ విజయసాయిరెడ్డికి దగ్గరి బంధువు అని తెలుస్తోంది. అల్లుడు అవుతాడు.. ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఎంపీ విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నాడు. కాగా విజయసాయిరెడ్డి భార్య సునంద సొంత చెల్లెలి కుమార్తె అయిన అలేఖ్య రెడ్డిని నందమూరి తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ కారణంగా విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు అవుతాడన్నమాట. అలేఖ్యరెడ్డి గతంలో ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. ఆ సమయంలోనే హీరోగా చేస్తున్న తారకరత్నకు కూడా ఆమె పని చేసింది. అలా మొదలైన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. కానీ వీరి పెండ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో హైదరాబాదులోని సంగీ టెంపుల్ లో సింపుల్ గా పెండ్లి చేసుకుని ఒక్కటయ్యారు.