AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత సీఏ అరెస్టు

దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ వేగం పెంచింది. తాజాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ (సీఏ) గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్‌ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బుచ్చిబాబును కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనుంది. దీంతో కవిత వర్గంలో టెన్షన్‌ మొదలైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ కేసులో రెండో ఛార్జిషీట్‌ను దాఖలు చేయగా.. ఇందులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చింది.

కొద్దిరోజులు కాకముందే బుచ్చిబాబును అరెస్టు చేసింది. హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసిన సీబీఐ అధికారులు.. ఆయనను ఢిల్లీకి తరలించారు. గతంలో బుచ్చిబాబు ఇంట్లో సీబీఐ సోదాలు జరపగా.. ఢిల్లీకి పిలిపించి పలుమార్లు ప్రశ్నించింది. ఇప్పుడు ఏకంగా అరెస్ట్‌ చేయడం ఈ కేసులో కీలకంగా మారింది. రౌస్‌ రెవెన్యూ స్పెషల్‌ కోర్టులో బుచ్చిబాబును సీబీఐ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. విచారణ కోసం కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరనున్నారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం పాలసీలో ఆడిటర్‌ బుచ్చిబాబు కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ గుర్తించింది. అందులో భాగంగానే ఆయన ఇంట్లో సోదాలు జరపడంతో పాటు పలుమార్లు విచారించింది. ఇప్పుడు ఆయన పాత్ర గురించి మరిన్ని వివరాలు తెలియడంతో అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ లిక్కర్‌ వ్యాపారి రామచంద్రన్‌ పిళ్లైకి ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా బుచ్చిబాబు పనిచేశారు. బుచ్చిబాబు అరెస్ట్‌తో త్వరలో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశముందని వార్తలొస్తున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10