తల నిండా వెంట్రుకలు ఉంటే ఆ అందమే వేరు, కానీ వెంట్రుకలు ఉన్నపుడు కొన్ని సమస్యలు వెంటాడుతాయి. జుట్టు రాలడం, తెల్లబడటం, పలుచబడటం, చుండ్రు, పొడిబారడం, చిట్లడం లేదా చివర్లు చీలిపోవడం ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి జుట్టుకోసం ప్రత్యేకమైన సంరక్షణ విధానాలు అవలంబించాలి. అయితే అన్ని రకాల జుట్టు సమస్యలకు మందార పువ్వులు అద్భుత పరిష్కారం కావచ్చు. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటు వాటికి మంచి పోషణ అందించడానికి, జుట్టును కుదుళ్ల నుంచి బలోపేతం చేయడానికి , అలాగే పొడవాటి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు మందార పువ్వులు ఉపయోగపడతాయి. మందార పువ్వుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నట్లు ఆయుర్వేదం చెబుతుంది. బట్టతల ప్యాచ్ లను తొలగించడానికి కూడా మందారాలు మంచివని నిపుణులు పేర్కొంటున్నారు. జుట్టు సంరక్షణ కోసం మందార పువ్వులను ఎలా ఉపయోగించాలి, మందార పువ్వులను ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. మందార పువ్వును హెయిర్ మాస్క్ లాగా తయారు చేసుకొని ఉపయోగించవచ్చు. హెయిర్ మాస్క్ తయారు చేసుకునే రెండు విధానాలు, ఉపయోగించే విధానం ఇక్కడ చూడండి. DIY Hibiscus Hair Masks- మందార ఉసిరి హెయిర్ ప్యాక్: మందార పువ్వు రేకులు, ఆకులను పేస్ట్‌గా చేయండి. ఇందులో ఉసిరి పౌడర్ కలిపండి, ఆపైన ఈ మిశ్రమాన్ని హెయిర్ ప్యాక్ వేసుకుని, సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తరువాత, షాంపూతో కడిగేసుకోండి. ఒత్తైన మెరిసే జుట్టు కోసం, ఈ మందార ఉసిరి హెయిర్ ప్యాక్‌ని తలకు అప్లై చేయండి. మందార అలోవెరా హెయిర్ మాస్క్ కొన్ని మందార ఆకులు, పువ్వుల రేకులను కలిపి పేస్ట్ తయారు చేయండి. ఆ పేస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కలపండి.
ఈ హెయిర్ మాస్క్‌ని మీ జుట్టు మూలాల నుండి చివర్ల వరకు అప్లై చేసి, 30 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆపై కడిగేసుకోండి. పొడి, చిరిగిన జుట్టును తేమ చేయడానికి ఈ హెయిర్ మాస్క్‌ని ఉపయోగించవచ్చు. Hibiscus for Hair- మందార పువ్వులతో జుట్టుకు ప్రయోజనాలు జుట్టు సంరక్షణ కోసం మందార పువ్వులను ఉపయోగించడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి. జుట్టు పెరుగుదలకు మందార పువ్వులలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కెరాటిన్ కీలకమైన భాగం, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కెరాటిన్ జుట్టుకు బిల్డింగ్ బ్లాక్ లాంటిది, ఇది జుట్టును బంధిస్తుంది, దాని పెళుసుదనాన్ని తగ్గిస్తుంది. అదనంగా, ఇది జుట్టు తంతువుల మొత్తం మందాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి కెరాటిన్ చికిత్సల కోసం డబ్బు ఖర్చు చేయడం కంటే, వారి జుట్టుకు మందారను ఉపయోగించడం చాలా మేలు. జుట్టు రాలడం అరికట్టడానికి మందారం జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. బట్టతలకి దారితీసే అలోపేసియా వంటి సమస్యను పరిష్కరించడానికి కూడా సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం, జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో హార్మోన్ల అసమతుల్యత ఒకటి. హర్మోన్లు అసమతుల్యమైనప్పుడు, శరీరం వేడెక్కడం ప్రారంభమవుతుంది, జుట్టు రాలుతుంది. మందారంలోని గుణాలు శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది, పిట్ట దోషాన్ని సమతుల్యం చేస్తుంది,
ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. నెరిసిన జుట్టుకు పరిష్కారం ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అని కూడా పిలిచే వెంట్రుకల గంగు మారడం తరచుగా ఆక్సీకరణ ఒత్తిడి వల్ల సంభవిస్తుంది. UV కిరణాల నుండి ఆక్సీకరణ ఒత్తిడి లేదా మానసిక, భావోద్వేగ ఒత్తిళ్లు వెంట్రుకల కుదుళ్ల వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుందని పరిశోధనలు తెలిపాయి. విటమిన్ సి, మందారలో కనిపించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. చుండ్రు నివారణకు మందార నూనెను ఉపయోగించడం వల్ల కూడా చుండ్రు తగ్గుతుంది. అధ్యయనాల ప్రకారం, మందారలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్‌లు, విటమిన్లు A, C వంటి యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి తలకు పోషణ అందించి సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. చుండ్రుకు కారణమయ్యే ప్రధాన కారకాలలో తలపై అధికంగా ఉత్పత్తి అయ్యే సెబమ్ ఒకటి . మందారలో ఈ సెబమ్ ఉత్పత్తిని నియంత్రించే ఆస్ట్రింజెంట్ గుణాలు ఉన్నందున, ఇది చుండ్రును కూడా తగ్గిస్తుంది.