AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జపాన్ బీచ్‌లో భారీ ఇనుప గుండు?!

టోక్యో: జపాన్ ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఓ ఇనుప గుండు రోజుల తరబడి అక్కడ ఉండడంతో అనేక ఊహాగానాలకు దారితీసింది. అది ‘యుఫో’(అన్ ఐడెంటిపైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్) అయి ఉంటుందా, పేలుడు పదార్థమా, గూఢచర్య పరికరమా? అంటూ ఎవరికివారు ఊహాగానాలు చేశారు.

చైనా గూఢచారి బెలూన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో జపాన్‌లోని హమామట్సు నగరంలోని ఎన్షు బీచ్‌కు ఇనుప గుండు కొట్టుకురావడంతో జపాన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచి, ఆ గోళాన్ని పరిశీలించారు.

తుప్పు పట్టిన ఆ ఇనుప గుండును ఎక్స్‌రే తీసి చూస్తే అది సముద్రంలో కొట్టుకు వచ్చిన మందుపాతర గుండు మాత్రం కాదని కనుగొన్నారు. పైగా అదో స్క్రాప్ మెటల్ అని తేలింది. కాగా ఒకానొక కాలంలో లంగరు వేయడానికి ఉపయోగించే ‘బోయ్’(buoy) అని ‘ద న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. కాగా నిపుణులు మాత్రం ఇటువంటి పరికరాలను సాధారణంగా షిప్పింగ్, సముద్ర పరిశోధన కోసం ఉపయోగిస్తారని, జపాన్ స్పందన భిన్నంగా ఉందని భావించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10