ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సంచలనం
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. స్పెషల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును మరోమారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలక పాత్ర పోషించిందని ఇప్పటికే ఈడీ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. సౌత్ గ్రూపులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్సీ కవిత అరబిందో ఫార్మా గ్రూప్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఉన్నట్లు పేర్కొంది. అయితే ఇందులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డికి కూడా పాత్ర ఉందని తేల్చిన ఈడీ 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది. అయితే రిమాండ్ రిపోర్టులో మరోసారి కవిత పేరు చేర్చడం ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో చార్జ్ షీట్ దాఖలు చేసిన సమయంలో కోర్టు విచారణ మాత్రమే ఉంటుందని అరెస్టులు ఉండవని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఒక్కొక్కరు అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సౌత్ గ్రూప్ లోని అరబిందో ఫార్మ డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి జైలులో ఉన్నారు. ఇప్పుడు రాఘవను ఈడీ కస్టడిలోకి తీసుకొని విచారిస్తోంది. ఆ తరువాత ఏం జరుగుతోందనని ఆందోళన నెలకొంది. ఒకవేళ ఈడీ నివేదికను బట్టి అరెస్టు కూడా ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ కవిత వద్ద ఒకప్పుడు ఆ డిటర్ గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసి కస్టడిలోకి తీసుకొని విచారించింది. కవితకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు నడిపించి గోరంట్ల బుచ్చిబాబేనని ఈడీ సప్లమెంటరీ నివేదికలో పేర్కొంది. హైదరాబాద్ లోని బుచ్చిబాబు కార్యాలయాల్లో దొరికిన ఆధారాలను నిశితంగా పరిశీలించిన తరువాత ఇప్పుడు వాటన్నింటిని కస్టడిలోకి తీసుకుంది.