ఐపాక్ టీమ్ గురించి తెలుసు కదా. ప్రశాంత్ కిషోర్ సారథ్యంలో ఈ టీమ్ వర్క్ చేస్తోంది. సీఎం జగన్ కోసం 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీమ్ వైసీపీ పార్టీ తరుపున పనిచేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపులో ఐపాక్ టీమ్ వర్క్ కూడా ఉంది. అయితే.. అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. 2024 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలుస్తుందా? అనేది పెద్ద ప్రశ్నగానే మిగిలింది. తాజాగా అవే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి పరాభవం తప్పేలా లేదు..
అని కొన్ని వార్తా పత్రికలు కథనాలను వెలువరించాయి. IPAC key announcement on TDP ap politics మరోవైపు ఈ విషయాన్ని ఎవరో వెల్లడించలేదు.. ఐపాక్ టీమే అంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసింది. దీనిపై ఐపాక్ టీమ్ వెంటనే స్పందించింది. కీలక ప్రకటన విడుదల చేసింది. తాము తొమ్మిది రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్నామని చెప్పుకొచ్చింది. అక్కడ ఉన్న రాజకీయ పార్టీలను గెలిపించేందుకే తాము కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చింది. అంతే కానీ.. తమ సంస్థ రిపోర్ట్ పేరుతో మీడియాలో వచ్చిన కథనాలు తప్పుడు కథనాలు అని, అది కావాలని ఒక వర్గం మీడియా నెగెటివ్ గా ప్రచారం చేస్తుందని ప్రకటించింది.