హైదరాబాద్: గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విజయవంతం చేయాలని కాసాని (Kasani Gnaneshwar) పిలుపునిచ్చారు. ఆదివారం ‘‘ఇంటింటికీ తెలుగుదేశం’’ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ భవన్(NTR Bhavan)లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామగ్రామాన తెలుగుదేశం నినాదం మారుమోగేలా చేస్తామని వెల్లడించారు. టీడీపీకి పూర్వవైభవం తీసుకురావటానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని, టీడీపీ నేతలంతా నెలరోజుల పాటు గ్రామాలు, బస్తీల్లోనే ఉండాలన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా టీడీపీని బలోపేతం చేస్తామని, టీడీపీలో చేరికకు పలువురు ఇతర పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.