AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్‌ను సెర్బియా టెన్నిస్ స్టార్ నోవక్ జకోవిచ్ సొంతం

ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్‌ను సెర్బియా టెన్నిస్ స్టార్ నోవక్ జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో 3వ సీడ్ స్టేఫానస్ సిట్సిపాస్‌పై 6-3 7- 6 7-6 తేడాతో జకోవిచ్ విజయాన్ని సాధించాడు. ఈ మ్యాచ్‌లో జకోవిచ్‌కు సులభంగా విజయం దక్కలేదు. చివరి పాయింట్ వరకు హోరాహోరీగా ఈ మ్యాచ్ సాగింది. ఆరంభంలో జకోవిచ్‌పై సిట్సిపాస్ ఆధిపత్యాన్ని కనబరిచాడు. తొలి సెట్‌ను 6-3 తేడాతో సొంతం చేసుకున్నాడు. సిట్సిపాస్‌ జోరు చూస్తే అతడు విజేతగా నిలవడం ఖాయం అనిపించింది. రెండో సెట్‌లో జకోవిచ్‌, సిట్సిపాస్ నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డారు. చెరో పాయింట్ గెలుస్తూ వెళ్లడంతో సెట్ టై బ్రేకర్‌కు దారితీసింది.

ఈ తరుణంలో వరుస పాయింట్లు సాధించిన జకోవిచ్ రెండో సెట్ గెలిచాడు. మూడో సెట్‌లో సిట్సిపాస్ నుంచి జకోవిచ్‌కు గట్టి పోటీ ఎదురైంది. మూడో సెట్ కూడా టై బ్రేక్‌గా నిలిచింది. తన అనుభవాన్ని ఉపయోగిస్తూ మ్యాచ్ పాయింట్‌ను జకోవిచ్ గెలిచాడు. మొత్తంగా జకోవిచ్ కెరీర్‌లో ఇది పదో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కాగా ఓవరాల్‌గా 22వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్ గెలిచిన టెన్నిస్ ప్లేయర్‌గా నాదల్ రికార్డ్‌ను జకోవిచ్ సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో విజయాన్ని సాధించగానే కోర్టులోనే భావోద్వేగానికి లోనయ్యాడు జకోవిచ్‌. అతడు కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10