హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్లెట్ పై అసెంబ్లీకి వచ్చారు. ఇప్పటికే పలుమార్లు తన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం మూడు సార్లు ఆగిపోయి మొండికేసింది. ఈ క్రమంలో తన వాహనాన్ని మార్చాలంటూ ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాజాసింగ్.. వినూత్న నిరసనకు తెరదీశారు.
ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారును నిన్న ప్రగతి భవన్ గేటు దగ్గర వదిలేశారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక శనివారం అసెంబ్లీకి తన బుల్లెట్ బండిపై వచ్చేశారు. పోలీసులు అసెంబ్లీ లోపలికి వదలడంతో గేట్ నంబర్ 2 నుంచి లోపలికి వెళ్లారు.